ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి
తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి
పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి
Indariki Abhayambu - Annamacharya Sankeerthana Lyrics
indariki abhayambulichhu cheyi kanduvagu manchi bangaru cheyi
velaleni vedamulu vedaki techhina cheyi chiluku gubbali kindha cherchu cheyi
kaliki yagu bhookaanta kougalinchina cheyi valanaina konagolla vadi cheyi
tanivaoka bali cheta danamadigina cheyi onaranga bhoodaana mosagu cheyi
monasi jalanidhi yammumonaku dechhina cheyi yenaya nagelu dhariyinchu cheyi
purasatula maanamulu pollasesina cheyi turagambu barapedi dodda cheyi
tiruvenkatachala dheeshudai maokshambu teruvu pranula kella telipedi cheyi
No comments:
Post a Comment