
Movie : Guduputani
Music : S. P. Kodandapani
Lyricist : Dasaradhi Krishnamacharya
Singers : S.P.B, Suseela
tanivi teeralede na manasu nindalede
enati bandamee anuragam
cheliya ... o cheliya..
yenno vasantavelalalo valapula ooyalaloogame
yenno punnamiratrulalo vennela jalakalademe
andani andaala anchuke cherinanoo
virisina paruvaala lotule choosinanu
tanivi teeralede na manasu nindalede
enati bandamee anuragam
priyatama o priyatama
yeppudu neeve nato unte yenni vasantalaitenemi
kannula neeve kanabadutunte yenni punnamulu vastenemi
vecchani kougililo hayiga kariginchinanoo
teeyani hrudayamlo tenele kuripinchinanoo
Tanivi Teeralede Telugu Song Lyrics in Telugu
చిత్రం: గూడుపుఠాణీ (1972)
సంగీతం: ఎస్ పీ కోదండపాణి
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యము, సుశీల
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ... ఓ చెలియా..
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
Good Songs
ReplyDeleteONE OF THE GOOD SONG OF SUPERSTAR KRISHNA
ReplyDeleteIT IS MEMORABLE SONG